Surprise Me!

Narayana College Principal Audio Tape Leaked 'ఆడియో టేపు' లీక్ | Oneindia Telugu

2017-11-03 12 Dailymotion

An audio tape Leaked through social media gone viral, Audio contains Narayana Junior College Principal And Vice Principal Conversation
విద్యార్థుల ఆత్మహత్యలతో ఇప్పటికే కావాల్సినంత చెడ్డ పేరు మూటగట్టుకున్న నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.
నారాయణ కాలేజీ రామంతపూర్ మాజీ ప్రిన్సిపాల్ సరిత అగర్వాల్, వైస్ ప్రిన్సిపాల్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేపు ఒకటి ఇప్పుడు సంచలనానికి దారితీసింది. ఆడియో టేపులో, బ్లాక్ మనీ, నోట్ల రద్దు, వివాహేతర సంబంధాల అంశాలు కూడా చర్చకు రావడం గమనార్హం.
గతంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీలత అనే ప్రిన్సిపాల్ వేధింపుల వల్లనే బలవన్మరణానికి పాల్పడినట్టు వీరిద్దరి మధ్య సంభాషణ సాగింది. ఉన్నతాధికారుల లైంగికంగా సహకరించకపోతే బ్లాక్ మెయిల్ చేస్తుంటారని వీరి సంభాషణలో వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఇప్పటికే విద్యార్థుల ఆత్మహత్యలతో నారాయణ విద్యా సంస్థలు అప్రతిష్టను మూటగట్టుకున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఆడియో టేపు నిర్వాకంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. రామాంతపూర్ నారాయణ బ్రాంచ్ పై దాడి చేసిన విద్యార్థి సంఘాలు ఫర్నీచర్ ధ్వంసం చేశారు. విద్యాసంస్థల అధినేత నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Buy Now on CodeCanyon